హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధుల కొరతతో అర్ధాంతరంగా ఆగిన పనులు

NRPT: మక్తల్(M) మంథన్లోడ్ గ్రామంలో మూడేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పిల్లల కోసం భవనాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.