హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

MDK: జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రేగోడ్ మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత 15.9 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 31.1 డిగ్రీలుగా నమోదైంది. మెదక్ పట్టణంలో కనిష్ట ఉష్ణోగ్రత 15.3 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.