HNK: ధర్మసాగర్ మండలం రాంపూర్ స్టేజ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇన్నోవా కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
తెలంగాణ
VIDEO: కారు బోల్తా.. ఏడుగురికి గాయాలు


