ASF: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో ఈ నెల 16న సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. బాలల హక్కులు, భద్రత, విద్య, ఆరోగ్యం, పోషకాహార సమస్యలపై పిల్లల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామన్నారు. పిల్లల వివరాలను గోప్యంగా ఉంచి సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు ఆసిఫాబాద్లో ప్రత్యేక పిల్లల ప్రజావాణి


