హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి తరలింపు.. 3 టిప్పర్లు, జేసీబీ పట్టివేత

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మల్లాపూర్ శివారులోని కేఎల్‌ఐ కాల్వ నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని గ్రామస్తులు, రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వాహనాలు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాయి. వాహనాలను విడిచిపెట్టేందుకు కొందరు నాయకులు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.