హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

PDPL: పెద్దపల్లిలోని మొత్తం 1,882 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 5,124 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని, ఈనెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు.