NRML: కుభీర్ మండలం వీర్ గామ్- శివునితండా, పార్ది(బి) -హల్టా వరకు తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. పనులు దక్కించుకున్న గుత్తే దారు మృతి చెందటంతో పనులు నిలిచిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. శివునితండా వరకు కంకర వేసి నిలిపివేయటంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూర్తి రోడ్డుతో గ్రామస్థుల అవస్థలు


