KMM: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి జరగనున్న మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు సెమిస్టర్లలో కలిపి 71,126 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఖమ్మం జిల్లాలో విద్యార్థుల కోసం 23 పరీక్ష కేంద్రాలను అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ వెల్లడించారు.
తెలంగాణ
రేపే కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు


