హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేషన్ లబ్ధిదారుల ఈ-కేవైసీ తప్పనిసరి'

KMM: జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియ చివరి దశకు చేరిందని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 13,37,262 లబ్ధిదారులకు గాను ఇప్పటివరకు 84.27 శాతం ఈ-కేవైసీ పూర్తయిందని పేర్కొన్నారు. రేషన్ కార్డులో పేర్లు నమోదై, ఇంకా ఈ- కేవైసీ చేయించుకోని వారు ఈ నెలాఖరులోగా రేషన్ దుకాణాల్లో ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని సూచించారు.