WGL: డిగ్రీ సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్లలో తప్పులకు కాలేజీలు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో చేసిన పొరపాట్లే కారణమని కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ శనివారం తెలిపారు. కాలేజీలు పంపిన వివరాల ఆధారంగానే హాల్ టికెట్లు జారీ చేస్తామని, ఇందులో యూనివర్సిటీ నిర్లక్ష్యం లేదని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ
'హాల్ టికెట్ల తప్పులకు కాలేజీలదే బాధ్యత'


