SDPT: హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన శ్రీకర్ (25) రోడ్డు ప్రమాదంలో గాయపడి, శనివారం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసి మానవత్వం చాటుకున్నారు. గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.
తెలంగాణ
మరణంలోనూ మానవత్వం.. శ్రీకర్ నేత్రదానం


