WGL: నగరంలోని నర్సంపేట మెయిన్ రోడ్డు, లేబర్ కాలనీలోని తెలంగాణ జంక్షన్ తదితర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేని, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న 23 వాహనాలను సీజ్ చేశారు.
తెలంగాణ
పోలీసుల తనిఖీలు.. వాహనాలు సీజ్


