హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య సూసైడ్.. భర్తపై కేసు నమోదు

JGL: జగిత్యాల పట్టణంలోని రాగుల శ్రీ విజయ (25) ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేణుగోపాల్, అతడి కుటుంబ సభ్యులు వేధించడంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ పి.కరుణాకర్ కేసు నమోదు చేశారు. డీఎస్పీ కె.పురుషోత్తం రెడ్డి దర్యాప్తు చేపట్టి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.