SDPT: తోగుట మండలం ఎల్లారెడ్డిపేట క్లస్టర్‌లో రైతులు వరి, మొక్కజొన్న వంటి ఎక్కువ నీరు, పెట్టుబడి అవసరమైన పంటల నుంచి ఉలవల సాగువైపు మళ్లుతున్నారు. రైతు కోల కంకయ్య గత యాసంగిలో రెండెకరాల్లో రూ.10 వేల పెట్టుబడితో 6 క్వింటాళ్లు పండించి లాభం పొందారు. దీంతో ఈసారి 25 మంది రైతులు 80 ఎకరాల్లో వేయనున్నారని వ్యవసాయ అధికారి నాగార్జున తెలిపారు.
తెలంగాణ
ఉలవల సాగువైపు మళ్లుతున్న రైతులు


