హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

MHBD: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మహబూబాబాద్- గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై రాంచరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి మృతుడి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.