హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటపాటలతో అలరించిన క్రీడాకారులు

KNR: కరీంనగర్‌లోని సెయింట్ అల్ఫోన్స్ పాఠశాలలో జరుగుతున్న అండర్‌-17 బాలబాలికల రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో భాగంగా శనివారం రాత్రి క్రీడాకారులు, శిక్షకులు క్యాంప్‌ఫైర్ నిర్వహించారు. పెద్ద మంట చుట్టూ చేరి నృత్యాలతో సందడి చేశారు. డీజే, జానపద గీతాలకు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు.