JN: లింగాలఘనపురం మండలంలోని పటేలుగూడెంలో శనివారం ప్రమాదవశాత్తు పెంకుటిల్లు దగ్ధమైంది. ఇంటి యజమానులు పూజ గదిలో దీపం వెలిగించి కుమార్తె వద్దకు వెళ్లగా, దీపం అంటుకుని మంటలు చెలరేగాయి. గమనించిన గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. రూ. 5 వేల నగదు, దుస్తులు,వంట సామగ్రి కాలిపోయాయి.
తెలంగాణ
దీపం అంటుకుని పెంకుటిల్లు దగ్ధం..!


