హైదరాబాద్: 28°C
తెలంగాణ

రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

JN: పట్టణంలోని గీతానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాచకొండ రాములు (57) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిద్ధిపేట రోడ్డులోని తన కార్యాలయంలో అపస్మారక స్థితిలో గుర్తించిన స్నేహితులు జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.