హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి పనులు చేయాలి'

MLG: పినిరెడ్డిగూడెం సుందరయ్య కాలనీలో తాగునీటి బావి ఉన్నా లోవోల్టేజీ కారణంగా నీటి సరఫరా తరచూ నిలిచిపోతోంది. శనివారం బనోత్ నరేష్ అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) శాఖ సమావేశంలో మండల కమిటీ సభ్యులు వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, మల్లెల నాగమణి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని, వీధి దీపాలు వేయాలని అధికారులను కోరారు.