HYD: దుండిగల్ PS పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బౌరంపేట బొడ్రాయి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ యార్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు బస్సులు దగ్ధమయ్యాయి. బస్సులు పక్కపక్క్నే పార్క్ చేసి ఉండటం వల్ల మంటలు పక్కనే ఉన్న బస్సులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ
దుండిగల్లో భారీ అగ్ని ప్రమాదం


