PDPL: రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక కోసం ఈనెల 17న ట్రయల్స్ నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్‌లో ఎంపిక పోటీలు జరగనున్నట్లు ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి. కృష్ణమూర్తి తెలిపారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికలకు స్విమ్మింగ్, వాటర్ పోలో పోటీలు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
ఈ నెల 17న ఆక్వాటిక్ పోటీలకు ఎంపికలు


