HNK: ఎల్కతుర్తి మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన గొర్రె తిరుపతి (40) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ నెల 5న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హనుమకొండ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ నర్సింహారావు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


