హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా లక్మక్కపల్లి మీదుగా ఇసుక రవాణా చేస్తున్న యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెంకు చెందిన శివరాత్రి అశోక్, కొమ్ము మనోజ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తఖీయుద్దీన్ తెలిపారు.