హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోటలో సర్వాయి పాపన్న శిల్పం గుర్తింపు

WGL: ఖిలా వరంగల్ పడమర కోట ద్వారం వద్ద ఉన్న రాతి శిల్పాన్ని సర్వాయి పాపన్నగా గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ శనివారం తెలిపారు. శిల్పంలో కుడిచేత కైజారు, ఎడమచేత మస్కట్ తుపాకీ, వీరకాసెతో నిల్చున్న వీరుడి రూపం కనిపిస్తోందన్నారు. పెద్ద మీసాలు, ప్రత్యేకమైన శరీరాకృతి వంటి లక్షణాల ఆధారంగా ఈ శిల్పం 17వ శతాబ్దానికి చెందినగా గుర్తింపు.