హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగ బంగారం కలకలం..!

JN: శివునిపల్లిలోని శేఖర్ జ్యూయలర్స్‌లో సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసులు శనివారం సోదాలు చేశారు. చోరీ బంగారాన్ని ఇక్కడ విక్రయించినట్లు నిందితుడు చెప్పడంతో తనిఖీలు చేపట్టారు. బంగారం నగదు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూడటంతో బంగారం తాకట్టు దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.