హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

SRPT: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తెలంగాణ వర్కర్స్ యూనియన్ నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర కార్యదర్శులు సుంకరి శ్రీనివాస్, జి.శ్రీదేవి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుంకరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.