హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

BDK: అశ్వారావుపేట మండలం ఉట్లపల్లిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నల్లబాడు గ్రామానికి చెందిన యువకుడు వీర్రాజు ద్విచక్ర వాహనం వస్తుండగా ఉట్లపల్లి బ్రిడ్జిపై అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలవగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుమారుడి మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.