హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్‌టెల్‌లో చోరీలు.. 9 మంది ముఠా అరెస్ట్

NLG: ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఇంజినీర్లు, నలుగురు టెక్నీషియన్లతో సహా 9 మంది అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 38 చోరీలకు పాల్పడి రూ.1.62 కోట్ల సొత్తు కొల్లగొట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం తెలిపారు. వారి నుంచి రూ.15 లక్షల నగదు, 3 కార్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు.