హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ అమలు

KMM: టీజీపీఎస్సీ శాఖాపరమైన పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు శనివారం సీపీ సునీల్ దత్ తెలిపారు. కేంద్రాల చుట్టూ గుమిగూడటంతో పాటు ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. నేటి నుంచి 23 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.