హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు నగరంలో విద్యుత్​ సరఫరాకు అంతరాయం

NZB: నగరంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏడీఈ వినోద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోనీ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ వినాయక నగర్–2 ఫీడర్పై అలాగే ఆర్యనగర్–2 ఫీడర్స్ టవర్స్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇవాళ ఉ.11:00 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.