హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేవెళ్లలో 22 కిలోల గంజాయి పట్టివేత

RR: చేవెళ్లలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిపై గతంలోనూ గంజాయి రవాణా కేసు ఉన్నట్లు తెలిపారు. అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.