హైదరాబాద్: 28°C
తెలంగాణ

MEPMA బజార్‌ను సందర్శించిన కమిషనర్

KMM: తెలంగాణ ప్రభుత్వం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న MEPMA బజార్‌ను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య శనివారం సందర్శించారు. స్థానిక మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బజార్లోని స్టాళ్లను పరిశీలించి, మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు.