హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుస పశువుల చోరీలు.. రైతుల్లో ఆందోళన!

VKB: బంట్వారం మండలం తొర్మామిడి గ్రామంలో పశువుల చోరీలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 12న తెల్లవారుజామున 2 గంటలకు లలిత కుమార్ పాస్టర్‌కు చెందిన ఎద్దును గుర్తుతెలియని వ్యక్తులు పొలం వద్ద దొంగిలించారు. నెలకోసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగల ముఠాను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.