NZB: ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లికి చెందిన షేక్ సలీం (35) గుండెపోటుతో మృతి చెందాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సలీంకు శనివారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి


