హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు ఆభరణాలు కాజేసిన ముగ్గురు మహిళల అరెస్ట్

హైదరాబాద్‌లో దృష్టి మరల్చి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముగ్గురు పాత నేరస్తులను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కూరగాయల మార్కెట్‌లో మాటలు కలిపి, నకిలీ బంగారు బిస్కెట్ చూపించి ఓ మహిళ మెడలోని చైన్‌ను కాజేశారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు వారి నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.