హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజకీయాలను శాసించే స్థాయికి బీసీలు ఎదగాలి'

మహబూబ్ నగర్ జిల్లాలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన సదర్ వేడుకల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవం, ఐక్యత, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. బీసీలు కేవలం ఓటర్లుగా కాకుండా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని, ఐక్యంగా ఉండి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.