హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయనిధి ద్వారా పేదలకు మేలు: ఎమ్మెల్యే

NGKL: సీఎం సహాయనిధి పథకం ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండల కేంద్రానికి చెందిన చిమ్ముల తిరుపతిరెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.