WNP: మేరా యువ భారత్ ఆధ్వర్యంలో చిట్యాల గురుకుల పాఠశాలలో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, షాట్పుట్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ రాజేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలలో క్రీడా పోటీలు


