హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరుణాచలానికి వేములవాడ నుంచి ప్రత్యేక బస్సు యాత్ర

SRCL: వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 22న అరుణాచలానికి ప్రత్యేక బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు రోజుల యాత్రలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబ ఆలయాలను దర్శించుకోవచ్చన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం నవంబర్ 25న తిరిగి వేములవాడకు చేరుకుంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ.5 వేలు, చిన్నారులకు రూ.3,750 ఛార్జీలు అని చెప్పారు.