హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహిత ఆత్మహత్య.. తండ్రి అనుమానం

WNP: పెద్దగూడెం గ్రామంలో బాస మాధవి (30) అనే వివాహిత శనివారం ఉదయం ఇంట్లో చీరతో ఊరేసుకుని మృతి చెందింది. అన్నారం గ్రామానికి చెందిన ఆమె తండ్రి ఎల్లపు శ్రీనివాసులు తన కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై రిషికేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.