హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి కొండగట్టులో చందనోత్సవాలు

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు కళావరోహణం, బాలాలయం ఏర్పాటు, అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. రేపటి నుంచి ఈ నెల 20 వరకు యజ్ఞ క్రతువులు, విశేష పారాయణాలు, అధివాసాలు నిర్వహిస్తారు. 20న మహాకుంభాభిషేకం జరగనుండగా, 21 నుంచి డిసెంబర్ 29 వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు.