హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బియ్యం దుకాణాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు

ELR: బియ్యం విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఏలూరు తంగెళ్లమూడి, పెదవేగి మండలం విజయరాయిలో విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు కొలతల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. బియ్యం సంచులపై MRP, తయారీదారుల వివరాలు లేకపోవడం, తక్కువ బరువు, ప్యాకింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి నాలుగు దుకాణాలపై ఐదు కేసులు నమోదు చేశారు.