హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమీక్ష

NLR: వింజమూరు మండలం బొమ్మరాజు చెరువులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు పంచాయతీ నాయకులతో సమావేశమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం, గ్రామస్థాయి సమన్వయంపై చర్చించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని సూచించారు.