హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి'

KRNL: ఉప్పర్లపల్లె సొసైటీ పరిధిలోని రైతులందరూ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సీఈఓ గిడ్డయ్య సూచించారు. సంఘంలో 7,142 మంది సభ్యులు ఉండగా, ఇప్పటివరకు 2,737 మంది మాత్రమే ఈ-కేవైసీ చేసుకున్నారని తెలిపారు. 2027 సొసైటీ ఎన్నికల్లో ఓటు వేయాలన్నా, పోటీ చేయాలన్నా ఈ-కేవైసీ తప్పనిసరని స్పష్టం చేశారు.