GNTR: పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై శనివారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో నామినేషన్, లెక్కింపు కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల స్వీకరణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


