హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయికి జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు.

మన్యం జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్టులతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మక్కువ, వంతరాం, భద్రగిరి, ఎన్. ములగ, పురోహితునివలస, సాలూరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ప్రకృతి ఆహార పదార్థాలు, శక్తి పరివర్తనం, సూక్ష్మ ప్లాస్టిక్ నివారణ, పర్యావరణహిత ఇటుకల తయారీ, యోగా తదితర అంశాలపై ప్రాజెక్టులు రూపకల్పన చేశారు.