W.G: ఆకివీడు మండలంలోని చినిమిల్లిపాడు, సిద్ధాపురం గ్రామాల్లో శనివారం స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు సీఐ కాళీ చరణ్, ఎస్సై శుభశేఖర్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల ప్రాముఖ్యత, ఎన్నికల సమయంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంత ఎన్నికల నిర్వహణపై ప్రజలకు అవగాహన


