హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: మంత్రి

NDL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శనివారం పిలుపునిచ్చారు. నంద్యాల క్యాంపు కార్యాలయంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. నంద్యాల, గోస్పాడు మండలాల్లో అన్ని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకునేలా సమష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు.