హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల వ్యయ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి'

ఎన్టీఆర్ జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఎన్నికల వ్యయ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్ సూచించారు. శనివారం విజయవాడలో రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన రెండో దశ బ్రీఫింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఖర్చులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.