W.G: కాళ్లకూరు స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం రాత్రి కార్తీక మాస వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టోత్తర శతనామార్చన, సహస్ర దీపాలంకరణ, ఉంజల్ సేవలను కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో శోభాయమానంగా వెలిగిపోయింది. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా కాళ్లకూరు వెంకన్న కార్తీక మాస వేడుకలు


